బికినీ షో తో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్..!

కుర్ర హీరోయిన్ల పోటీ ఎక్కువైనప్పటికీ… నిలదొక్కుకుని మరీ ఆఫర్లు దక్కించుకుంటుంది పంజాబి కుడి రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఏడాది ఈ అమ్మడు ఇప్పటీకే మూడు పెద్ద సినిమాల్లో నటించింది. వాటిలో సూర్య ‘ఎన్జీకే’, అజయ్ దేవగన్ ‘దేదే ప్యార్ దే’ , నాగార్జున ‘మన్మధుడు2’ చిత్రాల్లో నటించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది. ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా సరసన కూడా ఓ భారీ చిత్రం చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు యమ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ తన కొత్త కొత్త ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది.

అయితే ఈ మధ్య మాత్రం… ఆ ఫోటోలలో గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. తాజాగా ఈమె బికినీ ధరించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో రకుల్ తన హాట్ స్కిన్ షోతో తెగ రెచ్చిపోయింది. ఈ ఫొటోలకి కొంతమంది లైకులు కొట్టి.. సూపర్ అంటూ కామెంట్లు పెడుతుంటే… మరికొందరు మాత్రం ‘ఇలా తయారయ్యావ్ ఏంటి రకుల్’ అంటూ కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

1

2

3

4

5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus