హీరోయిన్లకి రకరకాల వ్యామోహాలుంటాయి. కొందరికి మేకప్ అంటే పిచ్చి, ఇంకొందరికి విదేశాలకు తిరగడం అంటే పిచ్చి. కానీ.. రకుల్ ప్రీత్ సింగ్ కి మాత్రం ఫిట్ నెస్ అంటే పిచ్చి. ఆమె రోజూ తినకుండా అయినా ఉండగలుగుతుందేమో కానీ.. జిమ్ చేయకుండా మాత్రం ఉండలేదు. ఈ విషయాన్ని ఆమె కూడా పలుమార్లు చెప్పినప్పటికీ.. ఆమెకు జిమ్ ఫిట్ నెస్ అంటే ఎంత వ్యామోహమో ఇవాళే తెలిసొచ్చింది. సాధారణంగా మన హీరోయిన్లు సెట్స్ లో లేదా ఏదైనా ట్రిప్పులకు వెళ్లినప్పుడు తప్ప రోడ్ల మీద కనిపించడానికి పెద్దగా ఇష్టపడరు.
అలాంటిది రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తన హిందీ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్ళడం కోసం కారు బదులు సైకిల్ వాడిందట. అది కూడా ఫిట్ నెస్ కోసమేనండోయ్. ఆమె నటిస్తున్న తాజా చిత్రం “దే దే ప్యార్ దే” సాంగ్ షూట్ కోసం లండన్ లో ఒకరోజు జిమ్ చేయడానికి కుదరకపోవడం.. ఆ రోజు ఆమె జిమ్ కి బదులుగా సైక్లింగ్ ను తన జిమ్ గా ఎంచుకొంది. ఫిట్ నెస్ మీద వ్యామోహం ఉండడం వరకు ఒకే కానీ.. మరీ ఇంత పిచ్చి ఉంటే కష్టం అమ్మాయ్ అని కొందరు అంటుంటే.. ఆమె కమిట్ మెంట్ చూసి ఇంకొందరు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి రకుల్ ఫిట్ నెస్ గోల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు