తెలుగులో బంపర్ ఆఫర్ కొట్టిన రకుల్ ప్రీత్ సింగ్

  • June 9, 2018 / 01:37 PM IST

“జయజానకి నాయక”కి ముందు వరకూ రకుల్ అంటే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆఫ్ టాలీవుడ్. ఆల్మోస్ట్ అందరు అగ్ర కథానాయకులతోనూ నటించిన ఈ అమ్మడు వరుస పరాజయాలు మరియు కొత్త భామల ఎంట్రీతో బాగా ఢీలాపడింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది. హిందీలోనూ ఒక సినిమాలో నటిస్తోంది. అయితే.. ఇంకొన్నాళ్లపాటు తెలుగు సినిమాల్లో కనిపించకపోతే.. తెలుగు ఆడియన్స్ తనను మర్చిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గ్రహించిన రకుల్ ఇమ్మీడియట్ గా ఒక తెలుగు సినిమాలో నటించాలని ఫిక్స్ అయ్యింది.

అయితే.. కాస్త గ్యాప్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకంటే ఏదైనా డిఫరెంట్ ఫిలిమ్ తో వస్తే బెటర్ అని భావించి క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఎన్టీఆర్” బయోపిక్ లో నటించేందుకు రంగం సిద్ధం చేసుకొంటోందని తెలుస్తోంది. ఆల్రెడీ తన క్లోజ్ ఫ్రెండ్ రాణా ద్వారా క్రిష్ కి సిఫారసు చేయించుకొన్న రకుల్.. ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus