పవన్ కళ్యాణ్ తీరు అందరికీ తెలిసిందే. ఏదీ ఓ పట్టాన నచ్చదు. అది వ్యక్తిగతంగానైనా సినిమాల పరంగానైనా. హీరోయిన్ల విషయానికే వస్తే.. ఐరన్ లెగ్ అని ముద్రేసిన శృతి హాసన్ ని ‘గబ్బర్ సింగ్’ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసి తొలి హిట్ ఇచ్చి, ఆ ముద్రని దూరం చేసి నేడు స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణమయ్యారు. ‘సర్దార్’ లో అనీషా అంబ్రోస్ హీరోయిన్ అని చివరి వరకూ అనుకోగా సడెన్ గా కాజల్ ఎంట్రీ ఇచ్చింది. ఇదివరకంటే పవన్ ఏడాదికో రెండేళ్లకో ఓ సినిమా చేసేవారు గనక హీరోయిన్ల కొరత పెద్దగా తెలిసేది కాదు. ఇప్పుడు ఏకకాలంలో పలు సినిమాలు చేస్తుండటంతో ఈ సమస్య పవన్ కీ తెలిసొచ్చింది.
ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమాని ముగించే పనిలో ఉన్న తర్వాత మిత్రుడు త్రివిక్రమ్ సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకి అవకాశం ఉంది. ఒకరు సమంత అని వినిపించినా చిత్ర బృందం ఏ విషయం తెలుపకపోవటంతో రెండు స్థానాలు ఖాళీ అని నమ్మాల్సి వస్తుంది. ఓ సందర్భంలో అనుపమ పరమేశ్వరన్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇప్పటికైతే అవన్నీ గాసిప్స్ కె పరిమితమవుతున్నాయి.
అటు నేశన్ తెరకెక్కించనున్న సినిమాకీ హీరోయిన్ కోసం గాలిస్తున్నారు చిత్రబృందం. ఓ రకంగా ఈ సినిమాకీ ఇద్దరు నాయికల అవసరం ఉంది. ‘వేదాళం’ రీమేక్ గా చెప్పుకుంటున్న ఈ సినిమాలో చెల్లి పాత్ర ఎంతో కీలకం. హీరోయిన్ పాత్రకు నయనతార పేరు వినిపించినా పవన్ తిరస్కరించారట. ఇప్పుడు ఆ స్థానంలోకి రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరింది. ఇధైనా ఖాయమవుతుందో లేదో..! రకుల్ పేరెత్తగానే పలువురు అబ్బాయ్ (రామ్ చరణ్)తో నటించి బాబాయ్ తో కూడానా అని పెదవి విరుస్తుంటే.. బాబాయ్ – అబ్బాయ్ లతో పాటు బన్నీతోనూ నటించిన కాజల్ ఇప్పుడు మెగాస్టార్ తో జోడీ కట్టలేదూ అని వాదిస్తున్నారు మరికొందరు. ఏదేమైనా ఈ నలుగురు భామలను పవన్ ఎలా వెతికి పట్టుకుంటాడో..?
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.