రకుల్ ఇది కొంచెం ఎక్కవ అనిపించడం లేదు…!

రకుల్ ప్రీత్ సింగ్… ‘కెరటం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. ఆ తరువాత చేసిన ‘లౌక్యం’ చిత్రంతో కూడా హిట్ అందుకోవడంతో దర్శక నిర్మాతలు ఈమె పై మక్కువ చూపారు. ఆ తరువాత రవితేజ తో ‘కిక్ 2’, రామ్ తో ‘పండగ చేస్కో’ , రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’ ‘ధృవ’, ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’, మహేష్ బాబు తో ‘స్పైడర్’ వంటి చిత్రాల్లో నటించింది.

తమిళ్ లో కూడా ఈమె వరుస సినిమాలు చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. అయితే ఈమెకు తెలుగులో ఎక్కువగా ఆఫర్ లు లేవు. ఇదిలా ఉంటే… ఈమె గతంలో సందీప్ కిషన్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మొన్నటికి మొన్న రానా తో కూడా ప్రేమలో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి. అయితే ఈమె పై ఎటువంటి రూమర్స్ ఇప్పటి వరకూ రాలేదు అంటూ చెప్పుకొస్తుంది. ఈమె మాట్లాడుతూ..”నేను ఇప్పటివరకు సింగిల్‌గానే ఉన్నాను.

నేను అబ్బాయిలకు దూరంగా ఉంటూ వచ్చాను. అందుకు కారణం ఒక రకంగా నా తమ్ముడే. చిన్నప్పటి నుండీ వాడు నన్ను గూఢాచారిలా ఫాలో అయ్యేవాడు. స్కూల్‌లో ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడితే వెంటనే ఇంట్లో చెప్పేసేవాడు. దాంతో అవసరమున్నా సరే అబ్బాయిలతో మాట్లాడేదాన్ని కాదు. అలా చిన్నప్పటి నుంచే అబ్బాయిలకు దూరంగా ఉండడం అలవాటైపోయింద`ని రకుల్ చెప్పుకొచ్చింది. దీంతో కొంతమంది.. ‘ఇది కొంచెం ఓవర్ అనిపించడం లేదా రకుల్’… అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus