సన్నబడిపోయిందనుకొంటే.. ఇంత హాట్ గా తయారయ్యిందేంటి

  • November 21, 2018 / 06:32 AM IST

“స్పైడర్” తర్వాత తెలుగు తెరపై కనిపించని రకుల్ అప్పుడప్పుడూ ఏదైనా ఈవెంట్స్ లేదా స్పెషల్ ఫోటోషూట్స్ ద్వారా మాత్రమే రీజనల్ ఆడియన్స్ ను పలకరించింది. అయితే.. పాత్ర కోసం తగ్గుతుందో లేక మరింకేదైనా కారణం ఉందో తెలియదు కానీ.. రోజుకి ఏకంగా నాలుగైదు గంటలు జిమ్ చేసి కోన్ ఐస్ క్రీమ్ లా ఉండే అమ్మాయి పుల్ల ఐస్ లో మిగిలిన పుల్లలా తయారయ్యింది. రాకుల్ వీరాభిమానులు సైతం ఆమె ట్రాన్స్ ఫార్మేషన్ చూసి షాక్ అవ్వడమే కాక బాధపడ్డారు కూడా. అయితే.. ఉన్నట్లుండి ఇవాళ ఉదయం రకుల్ పోస్ట్ చేసిన ఒక కొత్త ఫోటో మాత్రం నిన్నమొన్నటివరకూ రకుల్ మీద ఉన్న బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ను పోగొడుతూ.. వింటర్ సీజన్ లో వేడి పెంచేలా ఉంది. ఇది కొత్త ఫోటోషూట్ లో ఫోటోనా లేక ఏదైనా పాత పిక్చరా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతం రకుల్ కొత్త ఫోటో మాత్రం ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది. రకుల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే.. “సన్నబడిపోయిందనుకొంటే.. ఇంత సెక్సీగా తయారయ్యిందేంటీ?” అని ఆశ్చర్యపోతున్నారు కూడా. రకుల్ ప్రస్తుతం తెలుగులో “వెంకీ మామ”. తమిళంలో ఒక రెండు సినిమాలు మరియు హిందీలో రెండు సినిమాలతో చాలా బిజీగా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus