అసలే తెలుగులో సరైన అవకాశాల్లేవ్, పైపెచ్చు చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఈ రెండూ సరిపోవన్నట్లు అటు తమిళంలో కానీ.. ఇటు తెలుగులో కానీ స్టార్ హీరోలు రకుల్ ని కనీసం కన్సిడర్ చేయడం లేదు. దాంతో తమిళ, హిందీ సినిమాలతో సరిపెట్టుకుంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇలా రకరకాల ఇబ్బందులతో క్రుంగిపోతున్న రకుల్ కి రీసెంట్ గా పెద్ద షాక్ తగిలింది. షాక్ అంటే ఆమె సినిమా ఫ్లాపవ్వాడమో లేక మరింకేదో అనుకొనేరు.
విషయం ఏంటంటే.. రీసెంట్ గా ఓ ఫారిన్ కంట్రీలో లో రకుల్ తన స్నేహితులకు ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో భారీ పార్టీ ఇచ్చిందట. ఆల్రెడీ ఆ తరహా పార్టీలు హైద్రాబాద్ మరియు చెన్నైలో ఇచ్చి ఉన్న రకుల్ బిల్ మహా అయితే ఒక రెండు లేదా మూడు లక్షలు అవుతుందనుకుందట. కానీ.. ఆమె ఊహించనివిధంగా బిల్ ఏకంగా 10 లక్షలు అయ్యిందట. ఆ పొజిషన్ లో ఏమీ చేయలేక బిల్ కట్టేసినా కూడా తర్వాత మాత్రం చాలా బాధపడిందట. ఈ విషయాన్ని ఇటీవల రకుల్ స్వయంగా చెప్పడం విశేషం. ఎంత కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ రకుల్ ముందు నుంచీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేది.