బాలీవుడ్ ప్రొజెక్ట్ కోసం కష్టపడుతున్న రకుల్

  • August 22, 2018 / 11:54 AM IST

హీరోయిన్ అంటే మహా అయితే ఏం చేస్తారు.. హీరోల సరసన డ్యాన్స్ చేస్తారు, వాళ్ళతో రొమాన్స్ చేస్తారు లేదా కీలకమైన సన్నివేశాల్లో బ్లాంక్ ఫేస్ లు పెట్టుకొని బ్యాగ్రౌండ్ లో నిల్చుంటారు అని కాస్త చులకన భావం చాలా మందిలో ఉంటుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. నిన్నమొన్నటివరకూ మన సినిమాల్లో హీరోయిన్స్ ను అలాగే బ్యాగ్రౌండ్ గ్లామ్ డాల్స్ లా చూపించేవారు. అయితే.. ఈమధ్య వస్తున్న సినిమాల్లో కథానాయికకు ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రాధాన్యతతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. హీరోలతోపాటు ఒక్కోసారి హీరోల కంటే ఎక్కువగా కష్టపడుతున్నారు.

అందుకే రకుల్ ప్రీత్ సింగ్ తన హీరో అజయ్ దేవగణ్ కంటే ఎక్కువగా కష్టపడుతూ యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రకుల్ నటిస్తున్న తాజా బాలీవుడ్ ఫిలిమ్ కోసం రకుల్ హార్స్ రైడింగ్ తోపాటు ఫైట్ సీక్వెన్స్ లలో కూడా యాక్ట్ చేస్తోందట. ఇందుకోసం హార్స్ రైడింగ్ నేర్చుకొన్న రకుల్ స్పీడ్ చూసి యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ లాంటి అజయ్ దేవగణ్ కూడా షాక్ అయ్యాడట. మరి రకుల్ ఈసారైనా బాలీవుడ్ లో నిలదొక్కుకోగలుగుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus