‘వినయ విధేయ రామ’ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కైరా అద్వానీ జంటగా, డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా, డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘వినయ విధేయ రామ’. రామ్ చరణ్ తో బోయపాటి సినిమా అనగానే ఈ కాంబినేషన్ పైన అంచనాలు భారీగా పెరిగాయి. ఇక సినిమా టీజర్ తో పక్క మాస్ ఎంటర్టైనర్ గా సినిమా ఉంటుందని బోయపాటి చెప్పేసాడు. దీంతో ఈ సరికొత్త కాంబినేషన్ ఏ రేంజులో ఉంటుందో అని ప్రేక్షకులు సినిమా రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో డైరెక్టర్ బోయపాటి పక్క మాస్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నాడంట. ఈ ఐటెం సాంగ్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్, చరణ్ తో కలసి స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు రకుల్ బోయపాటి తో కలసి పనిచేయగా ఆ చనువుతో వెళ్లి చరణ్ తో కలసి ఐటెం సాంగ్ చేయడనికి ఒప్పించునట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలో ఐటెం సాంగ్ నిజంగా ఉంటుందా? దానికి రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది తెలియాలంటే కాస్త ఓపిక పట్టక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus