అర్జున్ రెడ్డి బృందానికి హ్యాట్సాఫ్ చెప్పిన రామ్ చరణ్!

  • September 11, 2017 / 09:41 AM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించిన అర్జున్ రెడ్డి మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఐదు కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మరింత వసూళ్లు సాధించే దిశగా సాగుతోంది. ఈ సినిమా సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలకు బాగా నచ్చుతోంది. ఈ సినిమాని చూసిన  రామ్ గోపాల్ వర్మ  దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్వీటీ అనుష్క తదితరులు “అర్జున్ రెడ్డి” బృందాన్ని ప్రశంసించారు.

తాజాగా ఈ చిత్రాన్ని చూసిన హీరో రామ్ చరణ్ ఫేస్ బుక్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “అర్జున్ రెడ్డిని చూశాను. చాలా బోల్డ్ గా ఉంది. సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణలకు హ్యాట్సాఫ్’ అని పోస్ట్ చేశారు. సినీ స్టార్స్ చేస్తున్న కామెంట్స్ చూసి వారి అభిమానులు సైతం అర్జున్ రెడ్డి ని చూసి కలక్షన్స్ ని పెంచుతున్నారు. ఇలా విజయ దేవరకొండకు స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరక్టర్లు పరోక్షంగా ప్రోత్సాహం అందిస్తున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus