భాగమతి సినిమా చూసి ఫీలింగ్ పంచుకున్న రామ్ చరణ్ దంపతులు!

  • February 2, 2018 / 10:54 AM IST

బాహుబలి చిత్రాల తర్వాత స్వీటీ అనుష్క చేసిన ఏకైక చిత్రం “భాగమతి” గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలై విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క నటనకు అందరూ థ్రిల్ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామచరణ్‌ భార్య ఉపాసన అయితే సినిమా చూసిన రాత్రంతా నిద్రపోలేదంట. ఈ విషయాన్నీ స్వయంగా చెర్రీ వెల్లడించారు. “నిన్న రాత్రి నేను, ఉపాసన “భాగమతి” సినిమా చూశాం. మైండ్‌ బ్లోయింగ్‌. చిత్రంలోని ప్రతి ఒక్కరూ చాలా బాగా పనిచేశారు. కంగ్రాట్స్‌. ‘భాగమతి’ చూసి మా ఆవిడకు రాత్రంతా నిద్రపట్టలేదు” అని సోషల్ మీడియాలో  పోస్ట్‌ చేశారు. ఉపాసన కూడా స్పందించారు. “నిజమే. ఓ మై గాడ్‌. సినిమా చూస్తున్నంతసేపు సీటు చివరిలో కూర్చున్నాను.

రాత్రంతా నిద్రపట్టలేదు. తప్పకుండా మీరూ సినిమా చూడండి” అని ట్వీట్‌ చేశారు. రంగస్థలం సినిమాను పూర్తి చేసే బిజీలో ఉన్న రామ్ చరణ్.. ఈ సినిమాని చూసి అభిప్రాయాన్ని పంచుకోవడం భాగమతి చిత్ర బృందానికి ఆనందం కలిగించింది. రామ్ చరణ్ మాటలకు అనుష్క స్పందించింది. “థ్యాంక్యూ  సో మచ్ రామ్ చరణ్. మీ అందరికీ సినిమా నచ్చినందుకు ఆనందంగా ఉంది. ‘భాగమతి’ టీమ్ కృషే ఇందుకు కారణం. నీ ‘రంగస్థలం’ బాగుండాలని కోరుకుంటున్నా. ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నా” అని తన ఫేస్ బుక్ ఖాతాలో అనుష్క  పోస్టును పెట్టింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus