బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ సినిమా స్టోరీ ఇలానే ఉండబోతోందా

  • June 4, 2018 / 10:42 AM IST

‘రంగస్థలం’ అనంతరం రామ్ చరణ్ నటిస్తున్న సినిమాపై బోలెడన్ని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. తొలుత ఈ చిత్రం సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో తెరకెక్కిన “ప్రేమ్ రతన్ ధన్ పాయో” రీమేక్ అని సినిమాకి “రాజవంశీయుడు” అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లుగా కూడా హడావుడి జరిగింది. కానీ అవేమీ నిజాలు కావని స్వయంగా బోయపాటి కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ వార్త గాల్లో కలిసిపోయింది. ఆ తర్వాత సినిమా గురించి చాలా కథనాలొచ్చాయి కానీ ఏవీ ఎక్కువకాలం నిలువలేదు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కథ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన “గ్యాంగ్ లీడర్”ను పోలి ఉంటుందట. ఆ సినినిమాలో ముగ్గురు అన్నదమ్ములుంటే.. ఈ చిత్రంలో అయిదుగురు అన్నదమ్ములు ఉండబోతున్నారట. అందుకే అంతమంది వదినలు & భారీ క్యాస్టింగ్ ఈ సినిమాలో కనిపించబోతున్నదంట. నలుగురు అన్నయ్యల్లో ఒకర్ని విలన్ అన్యాయంగా చంపేస్తే.. అతని మీద పగ తీర్చుకోవడమే మన కథానాయకుడు రామ్ చరణ్ ధ్యేయంగా ఉండబోతోంది. సో, ఒక కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus