మెగావారి కోడలి ధైర్యానికి ప్రశంసలు వెల్లువ..!

  • June 3, 2019 / 09:12 PM IST

మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్.. ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి దక్షిణాఫ్రికాలోని ప్రదేశాల్లో విహారయాత్రను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. వీటికి సంబందించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో ఉపాసన సింహం పిల్లలతో ఆడుకుంటున్నప్పుడు తీసిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. అంతేకాదు దీనికి ఉపాసన ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకర్షిస్తుంది.

ఉపాసన ఈ ఫోటోలకు ఈ విధంగా క్యాప్షన్ ఇచ్చింది. ఉపాసన స్పందిస్తూ… “ఇప్పుడు తెలిసిందా మీకు మిస్టర్‌ సి (చరణ్‌) నన్నెందుకు పెళ్ళి చేసుకున్నాడో! ఆఫ్రికా మాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ప్రకృతిని, జంతువులను గౌరవించాలి. వాటిని కాపాడుకునేందుకు మనవంతు ఏదన్నా చేసే సమయం వచ్చింది. చిన్న పనులు పెద్ద మార్పును తెస్తాయి” అంటూ పేర్కొంది. ఏమైనా ఈ మెగా వారి కోడలి ధైర్యానికి.. మానవత్వానికి.. ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus