ప్రేమకు తాళం వేసిన రామ్ చరణ్, ఉపాసన జంట

  • February 14, 2018 / 06:49 AM IST

నేడు ప్రేమికుల రోజు. యువతీ యువకులకు అత్యంత ఇష్టమైన రోజు. ప్రేమలో ఉన్నవారికి ప్రియమైన రోజు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు మరిచి పోలేని రోజు. అందుకే రామ్ చరణ్, ఉపాసన ఈ రోజుని మరిచిపోలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రేమికుల రోజుని ప్రత్యేకంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. అలాగే సోషల్ మీడియాలో మంచి సందేశాన్నిచ్చారు. ఒక తాళంపై ఉప్సి, రామ్ అని రాసి దానిని లాక్ చేశారు.. ఆ ఫోటోని షేర్ చేస్తూ …. “మా ప్రేమను ఎప్పటికీ లాక్ చేసాం.. ప్రేమికులరోజు శుభాకాంక్షలు” అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పోస్ట్ ద్వారా మా మధ్య ప్రేమ ఎప్పటికి తరిగిపోదు.. వీడిపోదని ఉపాసన చెప్పారు.

ప్రేమికుల రోజు శుభాకాంక్షలను ఇలా ప్రత్యేకంగా చెప్పడం మెగా అభిమానులకు బాగా నచ్చింది. ఈ పోస్ట్ ని లైకులు, షేర్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సమంత రామలక్ష్మిగా నటించిన ఈ చిత్రం మార్చి 30 న రిలీజ్ కానుంది. దీని తర్వాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్లో మూవీ చేయనున్నారు. ఈరోజు మాత్రం పనులన్నీ పక్కన పెట్టి ఉపాసనతో గడపనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus