‘పెద్ది'(Peddi) సినిమా ఈరోజు అనగా జూన్ 4న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నిన్న రాత్రి చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మిగతాదంతా ఫ్యాన్స్ చూసుకుంటారు.ఆ విషయం పక్కన పెట్టేస్తే.. ఈ మధ్య ‘పెద్ది’ కంటే ఎక్కువగా రాంచరణ్ కంటే ఎక్కువగా అతని బాడీ గార్డ్ కెవిన్ హాట్ టాపిక్ అయ్యారు. అతని గురించి సోషల్ మీడియాలో జరిగిన, జరుగుతున్న డిస్కషన్లు అన్నీ ఇన్నీ కావు. అసలు ఎవరు ఈ కెవిన్? అంటే..!
కెవిన్ అసలు పేరు అబ్దు కదీర్ సోవ్. 1998లో గాంబియాలో జన్మించాడు. ప్రస్తుతం ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో నివసిస్తున్నాడు. కెవిన్ బాడీగార్డ్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ MMA ఫైటర్ కూడా.!
రింగ్ లో ప్రత్యర్థులను చిత్తు చేసే ఈ ఇంటర్నేషనల్ ఫైటర్, గత 4 ఏళ్ళుగా మెగా ఫ్యామిలీకి నమ్మకమైన బాడీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. రామ్ చరణ్ కుటుంబానికి నీడలా ఉండే కెవిన్ ‘పెద్ది’ ప్రమోషన్స్ లో చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ఓ అభిమాని రామ్ చరణ్ స్టయిల్లో డ్రెస్సింగ్ చేసుకుని.. అతని వద్దకి వెళ్తుంటే.. కెవిన్ అతన్ని అడ్డుకుని ఒక్క చేత్తో లేపి తీసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెద్ది ప్రమోషన్స్ లో కెవిన్ గురించి కూడా చరణ్ ప్రస్తావించారు. “కెవిన్ నేను కేవలం సినిమాల కోసమే తీసుకోలేదు. నా భార్య ఉపాసన, పిల్లలు, మా ఫ్యామిలీ అందరికీ అతను భద్రత కల్పిస్తున్నాడు. 4 ఏళ్లుగా మేము వెళ్లే షూటింగ్స్, ఈవెంట్స్, ఫారిన్ ట్రిప్స్ వంటి వాటిలో కెవిన్ మా వెంటే ఉంటూ రక్షణ కల్పిస్తున్నాడు. ‘పెద్ది’ ప్రమోషన్స్ వల్ల అతను కూడా బాగా ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు అతను బయట కనిపిస్తే అంతా అతన్ని సెల్ఫీలు అడుగుతున్నారు.
అతనికి కూడా బాడీ గార్డ్ ను పెట్టాలేమో” అంటూ చమత్కరించాడు చరణ్.ఇదిలా ఉంటే.. ‘పెద్ది’ సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒక సన్నివేశం ఉంటుంది. రామ్ చరణ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అతన్ని ఔట్ చేసేందుకు ఎదురుగా ఉన్న బ్యాట్స్మెన్ ప్రవర్తిస్తాడు. అప్పుడు చరణ్ అతన్ని షర్ట్ పట్టుకుని వెనక్కి లాగితే గాల్లోకి ఎగిరి.. క్రీజ్లో చేరతాడు. ఆ సీన్ వచ్చినప్పుడు కొంతమంది థియేటర్లలో ‘కెవిన్ ను దృష్టిలో పెట్టుకునే బుచ్చి ఆ సీన్ రాశాడేమో’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.