టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ చాలా డిఫరెంట్ అనే చెప్పాలి. వారిలో ఉన్న ఐఖ్యత మరే కుటుంభంలోనూ లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు చూస్తుంటే కాస్త ఆలోచించాల్సిన సమయం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళితే…మెగా పవర్ స్టార్ రామ్ చరన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ మెగా హీరోలుగా ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపుతున్నారు. కానీ ఈ ఇద్దరిలో అల్లు అర్జున్ వరుస హిట్స్ తో దూసుకుపోతుంటే, చెర్రీ మాత్రం పరాజయాల పరంపర పుణ్యమా అని కాస్త వెనుక బడ్డాడు.
దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే…అల్లు అర్జున్ తన కేరీర్ స్టార్టింగ్ నుంచి ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. అదే ఇప్పుడు బన్నీకు ప్లస్ గా మారి, చెర్రీకు కాస్త ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇద్దరి కరియర్ లు చూసుకుంటే…బన్నీ కేరీర్‌లో చివరి మూడు నాలుగు సినిమాలు రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, సరైనోడు వైవిధ్యమైన కథతో వచ్చి హిట్ కొట్టినవే, ఇక సరైనోడు కూడా పక్క మాస్ సినిమా అయినప్పటికీ బన్నీ క్రేజ్ పుణ్యమా అని భారీ హిట్ గా నిలిచింది.
మరో పక్క చెర్రీ విషయానికి వస్తే….చెర్రీ మాస్ మూవీలో బాగానే చేస్తాడు. రొటీన్ స్టోరీలు అయినా రచ్చ, ఎవడు, నాయక్ మూవీలు చేసి హిట్ కొట్టాడు. దీంతోపాటు క్లాస్ లోనూ పట్టు కోసం `గోవిందుడు అందరివాడేలే`, – బ్రూస్ లీ లాంటి సినిమాలు చేశాడు చెర్రీ. కానీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మనడంతో తమిళ కధలపై పడ్డాడు. ఇప్పటికైనా..చెర్రీ కాస్త జాగ్రత్తగా రూటు మార్చి వైవిధ్యమైన కధలను ఎంచుకుని ముందుకు పోకపోతే ఇబ్బందులు తప్పవు అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. చూద్దాం మరి చెర్రీ ఏం చేస్తాడో.