ఆ ఫారిన్ బిజినెస్ మ్యాన్ ను పెట్టేసిన హీరోయిన్…!

ఇప్ప‌టికే కొంతమంది ఇండియన్ హీరోయిన్లు విదేశీ కుర్రాళ్లతో ప్రేమాయణం నడిపారు. అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి వార్తల్లో నిలిచే వారు. కొంతమంది ఊరికే ఫోటోలు తీసుకుంటే ప్రేమ వార్తలు వచ్చేసేవి. అయితే విదేశీయులను పెళ్ళి చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. ప్రియాంకా చోప్రా, ప్రీతిజింతా, శ్రియ తో పాటు మ‌రి కొంద‌రు హీరోయిన్లు విదేశీయుల‌ను పెళ్ళి చేసుకున్నారు. శ్రుతి హాస‌న్, ఇలియానా వంటి బ్యూటీలు కూడా విదేశీ కుర్రాళ్లతో ప్రేమాయణం సాగించి … బ్రేకప్ చెప్పేశారు.

వారి బాయ్ ఫ్రెండ్స్ తో తీసుకున్న ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా విదేశీయుడి ప్రేమలో మునిగితేలుతుంది. ఆమె ఎవరో కాదు ఇషా గుప్తా.బాలీవుడ్ లో వరుస సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ తెలుగులో రాంచరణ్ సరసన ‘ఏక్ బార్’ అంటూ ‘వినయ విధేయ రామా’ చిత్రంలో స్టెప్పులు వేసింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అయితే హాట్ హాట్ ఫోజులు ఇస్తూ నెటిజెన్లకు కావాల్సినంత ఫీస్ట్ ఇస్తుంది.

ఈ బ్యూటీ స్పెయిన్ కు చెందిన ఓ బిజినెస్ మెన్ తో ప్రేమలో పడినట్టు తెలిపి షాక్ ఇచ్చింది. అతని పేరు మాన్యూల్ కంపోస్ గుల్ల‌ర్ అని తన సోషల్ మీడియాలో తెలిపింది. “te amo mucho mi amor..” అంటూ స్పానిష్ లో తన ప్రేమ గురించి తెలిపింది. దీనికి అర్థం ‘i love you so much my love’ అని అర్ధమట.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus