యువరాజుగా కనిపించనున్న రామ్ చరణ్ తేజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ చిత్రం మార్చిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలోనే మొదలుకానుంది. అందుకు తగ్గట్టు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మొదటి షెడ్యూల్ రాజస్థాన్ లో సాగుతుందని సమాచారం. అక్కడే ఎందుకని ఆరాతీయగా అసలు విషయం బయటపడింది. ఇందులో రామ్ చరణ్ “రాజవంశస్థుడు”గా కనిపించబోతున్నట్లు తెలిసింది.

అందుకే అక్కడ రాజా మహల్ ని షూటింగ్ కోసం లీజుకు తీసుకున్నారంట. దాదాపు 30 శాతం అక్కడే షూట్ చేస్తారని టాక్. అలాగే ఇంకో విశేషం ఏమిటంటే … ఈ మూవీ లో చరణ్ రెండు షేడ్స్ లలో కనిపించబోతున్నాడని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. విలన్ గా బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ నటించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయెల్ పేరు పరిశీలిస్తున్నారు. రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషించనున్న మూవీ చరణ్ కెరీర్ లో అద్భుత చిత్రంగా నిలవనుందని బోయపాటి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus