నిన్నమొన్నటివరకూ ‘రంగస్థలం’ షూటింగ్ లో యమ బిజీగా ఉండడం వల్ల బోయపాటి సినిమా లాంఛనంగా ప్రారంభమై ఒక షెడ్యూల్ కూడా పూర్తయినప్పటికీ ఆ సినిమా సెట్స్ కి రాలేకపోయిన రామ్ చరణ్.. మార్చ్ 6 నుంచి మాత్రం బోయపాటి సినిమాకి ఫుల్ డేట్స్ ఇచ్చేశాడట. ఈలోపు “రంగస్థలం” కోసం పెంచిన గెడ్డంతోపాటు హెయిర్ ను కూడా స్టైల్ చేయించుకొని బోయపాటి ఫార్మాట్ మాస్ లుక్ ఎప్పీల్ తో కనిపించనున్నాడట. రామ్ చరణ్ తో ముందుగా అల్యూమిలియమ్ ఫ్యాక్టరీలో మంచి యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడట బోయపాటి. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో వివేక్ ఒబెరాయ్ కూడా పాల్గొననున్నాడట. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకి విడుదల చేసేందుకు నిర్మాత దానయ్య ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కైరా అద్వానీ కథానాయికగా కనువిందు చేయనుంది.
బోయపాటి శైలి మాస్ సినిమా కాకుండా కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మాస్ ఆడియన్స్ తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొనేందుకు రామ్ చరణ్ చేస్తున్న ప్లానింగ్ ఇది. అలాగే ఓవర్సీస్ లోనే మాస్ సినిమాల కంటే ఫ్యామిలీ మూవీస్ కే ప్రేక్షకుల ఓటు పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకొన్నాడు చరణ్. ఆల్రెడీ “రంగస్థలం”లో నటుడిగా ప్రూవ్ చేసుకొనే ప్రయత్నంలో ఉన్న చరణ్ కి బోయపాటి సినిమా పర్ఫెక్ట్ ఫిలిమ్ అని చెబుతున్నారు.