తారక్ ని టీజ్ చేసిన రామ్ చరణ్!

  • October 21, 2020 / 03:39 PM IST

దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు ఎన్టీఆర్ టీజర్ ని రెడీ చేస్తున్నారు. రేపే ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను రేకెత్తించే విధంగా రామ్ చరణ్ టీజర్ ఎలా ఉండబోతుందో.. చిన్న వీడియో క్లిప్ ని రిలీజ్ చేశాడు. ఇందులో కొమరం భీమ్ బల్లెం తీసుకొని శత్రువుల మీదకి దండెత్తబోతున్నట్లుగా కనిపిస్తోంది.

కొన్ని సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో మరింత ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. అయితే ఈ వీడియో రిలీజ్ చేస్తూ తారక్ ను టీజ్ చేసేలా చరణ్ ఒక కామెంట్ చేశాడు. ‘మార్చి 27న టీజర్ రిలీజ్ చేయడంతో కొంత ఆలస్యం జరిగిందని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని.. నీలాగ నేను ఆలస్యం చేయను.. రేపు చెప్పిన టైంకి రిలీజీ చేస్తా’ అంటూ తారక్ ని ఉద్దేశించి పంచ్ వేశాడు. దీనికి తారక్ రివర్స్ లో కౌంటర్ ఇచ్చాడు.

తన పుట్టినరోజు నాడు రావాల్సిన టీజర్ ను ఇప్పటికి రిలీజ్ చేస్తుండడంపై పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఆల్రెడీ ఐదు నెలలు లేట్ అయిందని అన్నారు. అలానే జక్కన్నతో డీల్ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. ఏమైనా జరగొచ్చని అన్నారు. ఈ లెక్కన చూస్తుంటే రేపు కూడా జక్కన ఆలస్యం చేస్తాడేమోననే సందేహాలు కలుగుతున్నాయి. చిత్రబృందం అనౌన్స్ చేసిన ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు భీమ్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రావాలి. మరి ఈ విషయంలో ఆలస్యం చేస్తారో..? టైమ్ కి వస్తారో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus