చరణ్ ప్లాన్ అదిరింది!

  • July 12, 2016 / 12:32 PM IST

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ధ్రువ’ చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కొత్తలుక్ తో కనిపించనున్నాడనే టాక్ రావడంతో, ఫస్టులుక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్టులుక్ ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయాలని చరణ్ నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం తన తండ్రి రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న150వ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ చరణ్.. చిరంజీవి పుట్టినరోజుకి తన సినిమా ఫస్ట్ లుక్ ని బహుమతిని ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. అలాగే ఈ సినిమా ఆడియో వేడుకను పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశాడని అంటున్నారు.

ఈ విశేషాలతో చరణ్ ఈ సినిమాకి మరింత క్రేజ్ ను తీసుకొచ్చే పనిలో వున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాను, అక్టోబర్ 7న విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus