మెగా పవర్‌స్టార్ డైలామాలో పడ్డాడు!!!

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకటైన మెగా ఫ్యామిలీకి చాలా మంది హీరోలు ఉన్నారు…అయితే అందరూ మెగాస్టార్ అండదండలతోనే ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకున్నారు అని అందరికీ తెలిసిన విషయమే…అయితే అదే క్రమంలో మెగాస్టార్ అసలు సిసలు వారసుడిగా అరంగేట్రం చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరన్ సైతం తనదైన శైలిలో మంచి సినిమాలతో దూసుకుపోతున్నాడు…విషయంలోకి వెళితే…ఈ మధ్య ఇండస్ట్రీలో కాంపిటేషన్ బాగా ఎక్కువ అయ్యింది…ప్రతీ హీరో తమ స్టామినాను నిరూపించుకునే అందుకు డిఫరెంట్ జొనర్స్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు….అయితే ఆ రేస్ లో మాత్రం చెర్రీ వెనుక బడ్డాడు అనే చెప్పాలి….చెర్రీ తొలి నాళ్ళలో ఇండస్ట్రీని శాసిస్తాడు అన్నంతగా దూసుకుపోయాడు.

అయితే అదే క్రమంలో తాజాగా ఫ్ల్యాప్స్ బాట పట్టిన ఈ మెగా పవర్ స్టార్ ప్రస్తుతం తన అదృష్టాన్ని ‘ధృవ’ రూపంలో పరీక్షించుకున్నాడు…ఈ సినిమా సూపర్ హిట్ అయితే ఒకే…కానీ…అలా కాకుండా నిరాశ పరిస్తే మాత్రం మన మెగా పవర్ స్టార్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికే మిగతా హీరోలు కాదు మెగా ఫ్యామిలీలోనే చెర్రికి పోటీగా హీరోలందరు సూపర్ హిట్స్ తో మంచి ఫాంలో ఉన్నారు. వారందరిని దాటి హిట్లు అందుకోవడం కాస్త కష్టమే అనిపిస్తుంది. ఇక మరో పక్క మెగాస్టార్ చిరంజీవి సినిమా నిర్మాణ భాధ్యతలను తీసుకునే సరికి తన సినిమా మీద అంత దృష్టి పెడుతున్నట్టు లేదు. అందుకే సినిమా అంత స్లో గా నడుస్తుంది…మరి ఇప్పటికైనా చెర్రీ….తన సినిమాపై ఫోకస్ పెట్టి మిసైల్ లా దూసుకు వచ్చి మంచి భారీ హిట్ ఇవ్వకపోతే…కాస్త కష్టమే అంటున్నాయి సినిమా వర్గాలు….చూడాలి మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus