సినిమా రిలీజ్ రోజు వచ్చిన టాక్ కి అసలు ప్రీ బిజినెస్ లో సాగమైనా వసూలు చేస్తుందని కనీసం నిర్మాతలు కూడా ఎక్స్ పెక్ట్ చేయలేదు. అలాంటిది రామ్ చరణ్ “వినయ విధేయ రామ” విడుదలైన అయిదు రోజుల్లోనే 60% రికవర్ చేసింది. దాంతో విశ్లేషకులు, ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. ముఖ్యంగా.. బి, సి సెంటర్స్ లో మాత్రమే కాక మల్టీప్లెక్స్ లలోనూ ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధిస్తుండడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
నైజాం: రూ. 12.60 కోట్లు, సీడెడ్ రూ. 11.98 కోట్లు, నెల్లూరు రూ. 2.90 కోట్లు, కృష్ణ రూ. 3.77 కోట్లు, గుంటూరు రూ. 6.40 కోట్లు, వైజాగ్ రూ. 8.30 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 5.30 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 4.35 కోట్లు, కర్నాటక రూ. 5.75 కోట్లు, ఓవర్సీస్ రూ. 1.50 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్ గా 62.5 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ ను భారీ లాస్ నుంచి తప్పించాడు రామ్ చరణ్.