Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

Advertisement

రామ్‌చరణ్‌ ఈ మధ్య కామెడీ సినిమాలు చేయడం తగ్గించాడు, ఒకవేళ చేస్తున్నా చాలా సెటిల్డ్‌ కామెడీ చేస్తున్నాడు కానీ.. అతనిలో మస్తు కామెడీ టైమింగ్‌ ఉంది అంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రచారం సమయంలో ఆ టైమింగ్‌ని, రైమింగ్‌ని మనం చూశాం కూడా. ఇప్పుడు చేస్తున్న ‘పెద్ది’ సినిమాలో కూడా రూరల్‌ కామెడీ కాస్త ఉందని చెబుతున్నారు. ఆ విషయం సినిమా వచ్చాక తెలుస్తుంది కానీ.. ఇప్పుడు సినిమా ప్రమోషనల్‌ వీడియోల్లో మాత్రం ఫుల్‌ ఫన్‌ ఇస్తున్నాడు.

Ram Charan – Buchi Babu

తాజాగా చిత్రబృందం ఓ వీడియోను రిలీజ్‌ చేసింది. అందులో రామ్‌ చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబు ఓ కారులో ప్రయాణిస్తున్నారు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే బుచ్చిబాబును లాంగ్‌ డ్రైవ్‌ కోసం రామ్‌చరణ్‌ అలా బయటకు తీసుకొచ్చారు. సినిమా వరుస షెడ్యూళ్లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు.. ఇలా ఫుల్‌ ఒత్తిడి ఉన్న ఈ సమయంలో రామ్‌చరణ్‌ నన్ను డ్రైవ్‌కి తీసుకొచ్చారు. అందుకు ఆయన థ్యాంక్స్‌ అంటూ తనదైన శైలిలో కాస్త బిడియంతో మాట్లాడారు దర్శకుడు బుచ్చిబాబు.

తన రైడ్‌ విషయాలు చెప్పిన తర్వాత రామ్‌చరణ్‌ తనదైన శైలిలో సినిమా గురించి వస్తున్న పుకార్లపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘నువ్వు పెద్ది ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పు’ అని చరణ్‌ అనగా.. జూన్‌ 4న సినిమా విడుదల అవుతుందని, అందరూ చూసి ఎంజాయ్‌ చేయాలని బుచ్చిబాబు చెప్పారు. నాలుగో తేదీ అని తెలిసేనా చేతిలో నాలుగు నెంబర్‌ చూపిస్తూ.. సినిమా ప్రచారానికి ఓ టెంప్లేట్‌ క్రియేట్‌ చేశాడు రామ్‌చరణ్‌.

వీడియో ఆఖరులో ఏది నీ కండలు చూపించు అంటూ బుచ్చిబాబును ఆట పట్టించాడు చరణ్‌. మొన్నీమధ్య సినిమా సెట్‌లోకి చిరంజీవి వచ్చారు అంటూ టీమ్‌ ఓ వీడియో రిలీజ్‌ చేసింది. అందులో కూడా ఇలానే కండలు చూపించే సీన్‌ ఒకటి ఉంది. రామ్‌చరణ్‌, బుచ్చిబాబు, ఆయన గురువు సుకుమార్‌ కలసి తమ కండలు చూపించిన షాట్‌ ఒకటి ఉంది. అదన్నమాట సంగతి.

మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus