రామ్ ను టెన్షన్ లో పడేసిన అభిమాని!

  • February 22, 2017 / 10:45 AM IST

చెప్పను బ్రదర్.. ఆపను బ్రదర్.. అడగొద్దు బ్రదర్ .. అంటూ మెగా హీరోలు చెప్పిన డైలాగులు కొంతకాలం క్రితం వార్తల్లో నిలిచాయి. ప్రస్తుతం టెన్షన్ పెట్టకు తమ్ముడు .. అనే మాట చక్కర్లు కొడుతోంది. ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? ఎందుకు చెప్పారు? అనే విషయాల్లోకి వెళ్తే.. సాధారణంగా సినిమా నటీనటులకు అభిమానులు ఎక్కువమంది ఉన్నారు. వారు తమహీరోపై రకరకాలుగా అభిమానం చూపిస్తుంటారు. హీరోయిన్స్ కి గుడి కట్టించినవారు కూడా ఉన్నారు. ఇటువంటి వీరాభిమాని ఒకరు ఎనర్జిటిక్ హీరో రామ్ కి షాక్ ఇచ్చాడు. “మీ కొత్త సినిమా ప్రకటన వచ్చే వరకు నేను నిరాహార దీక్ష చేస్తాను.. ఇది మొదటి రోజు” అంటూ రామ్ కి ట్వీట్ చేసాడు.

దీంతో ఆశ్చర్యపోయిన రామ్ “ఇలాంటి కొత్త టెన్షన్లు పెట్టకు తమ్ముడు..అదే పనిలో ఉన్నా” అంటూ ఫ్యాన్ కి రిప్లై ఇచ్చారు. గతఏడాది నేను శైలజ, హైపర్ సినిమాలతో అలరించిన రామ్  తర్వాత సినిమాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే జిమ్ ల్లో కసరత్తు చేస్తున్న ఫోటోలు, కొత్త గెటప్ లు పోస్టు చేస్తున్నారు. డైరక్టర్ ఎవరు? కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఎదురు చూసి చూసి విసిగిపోయిన అభిమాని ఇలా స్పందించినట్లు ఉన్నాడు. ఇతని ఉత్సాహం చూసి అయిన రామ్ త్వరలోనే కొత్త సినిమా విశేషాలు వెల్లడిస్తారని ఆశిద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus