ఎన్టీఆర్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పై వర్మ ట్వీట్!

  • May 19, 2018 / 03:55 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 28 వ సినిమా టైటిల్ ఏంటో ఈరోజు తెలిసింది. తెలుగులో విభిన్నమైన పేర్లు పెట్టే గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. “అరవింద సమేత వీర రాఘవ” అనే పేరుతో ఆకర్షించారు. టైటిల్ ఫ్యామిలీ కథలా ఉంటే .. ఫస్ట్ లుక్ చూస్తే యాక్షన్ అదిరిపోయేలా ఉంటుందని స్పష్టమవుతోంది. తారక్ ఇదివరకు ఎన్నడూ లేని విధంగా సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టారు. మూడు నెలల పాటు ఎన్టీఆర్ పడిన కష్టాన్ని ఈ లుక్ బయట పెట్టింది. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20 ) సందర్భంగా వచ్చిన ఈ లుక్ ఫ్యాన్స్ కి పండుగని ముందుగానే తీసుకొచ్చింది.

అభిమానులతో పాటు సినీ ప్రముఖులు ఈ లుక్ అదరహో అంటూ కితాబు ఇస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పై ప్రముఖ దర్శకుడు వర్మ తన దైన శైలిలో ట్వీట్ చేశారు. “వావ్ వ్ వ్.. సిక్స్ ప్యాక్ లో తారక్ ..సెక్స్ కన్నా ఎంతో సెక్సీగా ఎప్పుడూ చూడనంతగా ఉన్నాడు..” అంటూ ప్రసంశలు గుప్పించారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఆమె అరవింద రోల్ పోషిస్తున్నట్లు టైటిల్ వెల్లడించింది. ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో థియేటర్లోకి రానుంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus