వర్మ కన్ను ‘నయీమ్’పై పడింది….!!!

  • August 24, 2016 / 06:03 AM IST

నా సినిమా నా ఇష్టం..నచ్చితే చూడండి…లేదంటే మానెయ్యండి..ఇది ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్టైల్. అయితే సమాజంలో ఏది జరిగి న్యూస్ గా మారినా వర్మ అమాంతంగా అక్కడ వాలిపోయి ఆ సంఘటన పై సినిమాలు తీసేస్తూ ఉంటాడు. అదే క్రమంలో గతంలో ముంబై మాఫియా సినిమాలు, అనంత ఫ్యాక్షన్ సినిమాలు, ఇంకా చెప్పాలి అంటే బెజవాడ రక్త చరిత్రను గురించి తెలుపుతూ ఒక సినిమా చేసేసాడు. అయితే తాజాగా వర్మ కన్ను ఈ మధ్య హతం అయిన గ్యాంగ్ స్టార్ నయీమ్ పై పడింది.

విషయంలోకి వెళితే…వర్మ ట్వీట్ ప్రకారం…నయీమ్ నేరచరిత్రని సినిమాగా తీయబోతున్నట్టు ప్రకటించాడు వర్మ. మూడు భాగాలుగా ఆ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపాడు. అంతేకాకుండా గత రెండు మూడు వారాలుగా రోజూ వార్తల్లో కనిపిస్తున్న గ్యాంగ్ స్టర్ నయీమ్ చరిత్ర సాధారణ జనాన్ని భయభ్రాంతులకి గురిచేస్తోంది. వర్మకి కావల్సింది కూడా అలాంటి కథలే. అందుకే నయీమ్ చరిత్రని తెరకెక్కిస్తున్నట్టు ట్వీటాడు. నయీమ్ నేర చరిత్రకి సంబంధించిన విషయాల్ని తెప్పించుకొన్నానని అవన్నీ తెలుసుకొంటుంటే రోమాలు నిక్కబొడుచుకొంటున్నాయని వర్మ ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.

ఒక నక్సలైట్ గా ప్రయాణం మొదలుపెట్టి ఆ తర్వాత పోలీసు ఇన్ఫార్మర్ గా – గ్యాంగ్ స్టర్ గా మారిన వైనం చాలా అద్భుతంగా తెరకెక్కించాలని వర్మ ఫిక్స్ అయ్యాడని, త్వరలోనే ఈ సినిమాకి ముహూర్తం షాట్ కొడతానని వర్మ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా….నిజ జీవిత గాథలతో సినిమాలు చేయడంలో వర్మని మించినవాళ్లు మరొకరు ఉండరు అదే క్రమంలో ఈ కథలకి  క్రైమ్ నేపథ్యం కూడా ఉందంటే ఇక వర్మకి మరింత  ఉత్సాహం. మొత్తానికి మనం వర్మ పుణ్యమా అని నయీమ్ చరిత్ర తెలుసుకోబోతున్నాం అన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus