‘విజయ్ మాల్యా’పై హాట్ కామెంట్స్!!!

  • March 14, 2016 / 01:21 PM IST

సినిమా ఇండస్ట్రీ లో చాలా మందికి నోరు అదుపులో ఉండదు. అయితే కొందరు పొరపాటున నోరు జారతారు. కొందరు నోటికి దూల ఎక్కువయ్యి నోరుపారేసుకుంటారు. ఇంతకీ ఏ నోటి దూల వ్యవహారం ఏంటి అంటారా….అయితే ఈ కధ మనం చదవాల్సిందే…వివరాల్లోకి వెళితే…మన డైనమిక్, డాషింగ్, సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుసుగా…ఆయనకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అదేమిటంటే….నైట్ రెండు పెగ్స్ వెయ్యగానే ట్విటర్ వేదికగా తనకు నచ్చినట్లు, తనకు నచ్చిన, నచ్చని వారిపై ట్వీట్ చేస్తూ ఉంటాడు.

అయితే తాజాగా ఆయనకు విజయ్ మాల్యా గుర్తొచ్చాడు. ఆయనపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ మాల్యా అప్పులు, వాటిపై కేసులు, బ్యాంక్స్ పెడుతున్న గోల…..రోజు చూస్తూనే ఉన్నాం కదా, మరి ఏమయిందో ఏమో కానీ మొత్తానికి బ్యాంక్స్ వాళ్ళ బాధ మన దర్శకుడుకి అర్ధం అయినట్లు ఉంది.

వారికి సలహా ఇస్తున్నట్లుగా విజయ్ మాల్యాపై కొన్ని శెటైర్స్ వేశాడు. ఇంతకీ ఎంటా శెటైర్స్ అంటారా..మీరే చూడండి…బ్యాంకర్లు ఆయనకు ఇచ్చిన వేల కోట్ల అప్పులు కట్టే బదులు మాల్యా దగ్గర ఉన్న క్యాలెండర్ గర్ల్స్ ని ఒక్కొక్కరినీ ఒక్కొక్క బ్యాంకు కు ఇవ్వమంటే సరిపోతుంది, అప్పుడు ఏ గొడవ ఉండదు అంటూ ట్విట్ చేశారు. విజయ్ మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్ గర్ల్స్ ఆస్తులు ఏమైనా పెరిగి ఉంటే వారే ఆ రుణం తీర్చాల్సి బాధ్యత ఉంది కదా..! ఒకవేళ మాల్య గనకే ఈ ఆఫరిస్తే బ్యాంకులు అంగీకరించక పోవచ్చు కానీ బ్యాంకర్లు మాత్రం తప్పకుండా అంగీకరిస్తారు అంటూ బ్యాంకర్లకు చురకలేశారు. ఏది ఏమైనా..మన దర్శకుడి గారికి ఆ జ్యాస కాస్త ఎక్కువే అంటున్నాయి సినీ వర్గాలు. ఏం చేస్తాం మరి ఎంతకాదనుకున్నా బాలీవుడ్ ను టచ్ చేసి వచ్చాడు కదా…ఆ మాత్రం ద్యాస ఉండడం సహజమే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus