ఆసక్తిరేపుతున్న పవన్ పై వర్మ కామెంట్స్..!

  • June 27, 2020 / 05:00 PM IST

మియా మాల్కోవా నటించిన క్లైమాక్స్ మూవీ బాగా డబ్బులు కురిపించడంతో అదే స్పూర్తితో ముందుకు వెళుతున్నాడు వర్మ. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన్న ఆ మూవీ కోసం ప్రేక్షకులు పోటీ పడగా, సర్వర్ క్రాష్ అయ్యింది. క్లైమాక్స్ కి ఊహించని ఆదరణ దక్కిన నేపథ్యంలో వర్మ నగ్నం అనే మరో చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్ర ప్రోమోలు చూస్తుంటే శృంగార సన్నివేశాలు తెరకెక్కించడంలో వర్మ ఆలోచనలు పరాకాష్టకు చేరుకున్నాయని అర్థం అవుతుంది.

మరికొద్ది గంటలలో నగ్నం విడుదల కానుండగా దీని ధర 200 రూపాయలుగా పర్ వ్యూ గా నిర్ణయించాడు. కాగా ఈ మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న వర్మ పవన్ కళ్యాణ్ పై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. పవన్ ని ఆయన పొగడ్తలలో ముంచెత్తాడు. పవన్ ఫ్యూచర్ సీఎం అన్న వర్మ… వన్ అండ్ ఓన్లీ ఫీస్ అనడం విశేషం. అలాగే పవన్ వ్యక్తిగతంగా వెరీ టఫ్ అని చెప్పారు. మరి వర్మ తాజా వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్ లో జోష్ నింపడం ఖాయం. ఐతే గతంలో పవన్ ఫ్యాన్స్ వర్మని తిట్టిపోశారు.

పవన్ ని ఉద్దేశించి వర్మ చేసిన వ్యాఖ్యలు, సెటైరికల్ ట్వీట్స్ పై వారు మండిపడ్డారు. మొదటిసారి పవన్ గురించి వర్మ పాజిటివ్ కామెంట్స్ చేయగా ఆయన ఫ్యాన్స్ రియాక్షన్ ఏమిటనేది ఆసక్తిగా మారింది. కాగా చిరంజీవిని నటుడిగా ఇష్టపడతాను అన్న వర్మ.. పొలిటీషియన్ గా కాదు అన్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పై కూడా వర్మ కామెంట్ చేశాడు. తాత ఎన్టీఆర్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ అనడం కొసమెరుపు.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus