రాంగోపాల్ వర్మకు రాజకీయాలపై ప్రేమ పుట్టిన నిమిషం!

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మకు తాను తీసిన సినిమాలే ఓ పట్టాన నచ్చవు. అలాంటిది ఆయనకి ఉన్నట్లుంది రాజకీయాలపై ప్రేమ పుట్టింది. అది కూడా మామూలు ప్రేమ కాదండోయ్, ఆకర్షణతో కూడుకున్న ప్రేమ.

అస్సాంకు చెందిన ఓ నటి ఇటీవల అక్కడ భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సదరు ఎమ్మెల్యే హీరోయిన్ గా ఉన్నప్పుడు చేయించుకొన్న హాట్ ఫోటోషూట్ లు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.

వాటిలో కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేసిన వర్మ.. “ఎమ్మేల్యేలు ఇలా కూడా ఉండొచ్చా, నాకెందుకో పాలిటిక్స్ అంటే ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది” అంటూ ఓ ట్వీటేశాడు. వర్మ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరి సదరు సెక్సీ ఎమ్మెల్యే ఈ విషయంపై స్పందిస్తుందో లేక ఎందుకొచ్చిన గొడవలే అని వదిలేస్తుందో? చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus