సుకుమార్, రామ్ చరణ్ ను అభినందించిన వర్మ

  • April 3, 2018 / 12:09 PM IST

సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం.. బాహుబలి సినిమా తర్వాత రికార్డులన్నింటినీ సొంతం చేసుకోవడమే కాదు.. ఆ చిత్రం తర్వాత అత్యధికమంది అభినందించిన చిత్రంగా నిలిచింది. రామ్ చరణ్ నటన అద్భుతమని ఎన్టీఆర్ సైతం ట్వీట్ చేశారు. అలాగే మోహన్ బాబు కూడా చరణ్ ని ప్రశంసించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికపై పంచుకున్నారు. “రంగస్థలం తిరుగులేని విజయాన్ని అందుకుంది. రామ్ చరణ్ అయితే మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్. సుకుమార్ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేను.

ఇంత మంచి చిత్రాన్ని తీసినందుకు శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు. సుకుమార్ కి ఇష్టమైన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. అతను తన సినిమాని ప్రశంసించడంతో సుకుమార్ ఆనందంగా ఉన్నారు. ఇక మెగా ఫ్యామిలీ వాళ్ళు మాత్రం క్షణానికి ఒక్కో విధంగా మాట్లాడే వర్మ అభినందనను స్వాగతించాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వర్మ ఆఫీసర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. కింగ్ అక్కినేని నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం వచ్చే నెల థియేటర్లోకి రానుంది. ఈ సినిమాతోనైనా వర్మ పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus