రోజుకి 6 కథలు వింటున్నా.. మంచి కథలు దొరకడం లేదు

Advertisement

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. దర్శకుడు త్రినాధరావు నక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఊహించని విధంగా ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో రామ్ చెప్పిన డైలాగ్స్, ప్రకాష్ రాజ్.. రామ్ ల మధ్య జరిగే సంభాషణలు సినిమాపై హైప్ ని పెంచేశాయి. గురువారం విడుదలకానున్న ఈ చిత్రం గురించి రామ్ మాట్లాడుతూ చాలా విశేషాలు చెప్పాడు. వాటిలో అమితంగా ఆకట్టుకొన్న విషయం రోజుకి ఆరు కథలు వింటున్నాను కానీ.. ఒక్క కథ కూడా నచ్చడం లేదు అని చెప్పడం.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. “ఒక హీరోగా ఎక్కువ సినిమాలు చేయాలనే నాకూ ఉంది. అయితే నన్ను ఎగ్జైట్‌ చేసే స్క్రిప్ట్స్‌ నాకు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మా పెదనాన్నగారు కూడా స్క్రిప్ట్స్‌ వింటారు. నాకు ఏమాత్రం నచ్చుద్ది అని ఆయనకు అనిపించినా నన్ను స్క్రిప్ట్‌ వినమంటారు. ‘రామ రామ కృష్ణ కృష్ణ’ తర్వాత దిల్‌ రాజుతో చేస్తున్న సినిమా ఇది. మధ్యలో ఇద్దరం కలిసి సినిమాలు చేయాలనుకున్నాం. ఇద్దరికీ సరైన స్క్రిప్ట్‌ దొరకలేదు. దిల్‌ రాజుగారు ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌. సినిమా మేకింగ్‌లో బాగా ఇన్‌వాల్వ్‌ అయి సినిమా బాగా రావాలనే తపన ఉన్న వ్యక్తి” అన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus