తెరపైకి.. రామ్ పూరి కాంబినేషన్?

  • November 8, 2016 / 09:15 AM IST

ఎలాంటి హీరోకైనా మాస్ ఇమేజ్ ఇవ్వడంలో పూరి జగన్నాధ్ స్పెషలిస్ట్. పైగా చిన్న పెద్ద హీరోలన్న బేధం ఇసుమంతైనా ఉండదు. ఆయనకి తెలిసిందల్లా తన కథకు ఆ హీరోను ఎలా మార్చుకోవడం అన్నదే. అందుకే పూరితో పనిచేయాలనుకునే హీరోలు తమను తాము ఎంత కష్టపెట్టడానికైనా వెనుకాడరు. అల్లు అర్జున్ నుండి కళ్యాణ్ రామ్ వరకు అందరూ ఈ కోవాలోని వారే. కాగా ఇప్పుడు పూరి రామ్ తో సినిమా చేయనున్నట్టు వినికిడి.’నేను శైలజ’ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన రామ్ ‘హైపర్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అయినా ఇంతవరకు మరో సినిమా మొదలెట్టలేదు. అనిల్ రావిపూడి, కరుణాకరణ్ తదితర దర్శకులు రామ్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఇతగాడు మాత్రం పావుని ఎటూ మెదపకుండా ఉన్నాడు. ఈ పరిస్థులలో రామ్ ఫోటో ఒకటి నెట్టింట్లోకి వచ్చి హల్చల్ చేయడం ఆరంభించింది. ఇందులో రామ్ గుబురు మీసాలు తిప్పి గడ్డంతో కొత్తగా కనబడుతున్నాడు. ఓ హీరోని ఇలా మార్చేసేది పూరి, సుకుమార్ వంటి దర్శకులే. సుకుమార్ ఎటూ కమిటెడ్ గనక పూరి పేరుని లింక్ చేసి చెబుతున్నారు. పూరి స్క్రిప్ట్ కోసం బ్యాంకాక్ వెళ్లడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతుంది. పూరి వచ్చాకా క్లారిటీ ఇస్తారా లేక ‘నో షేవ్ నవంబర్’ అని రామ్ షాక్ ఇస్తాడో చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus