స్క్రిప్ట్ రెడీ అయితే నేను రెడీ : రామ్

  • October 17, 2018 / 06:16 AM IST

ఎనర్జటిక్ హీరో రామ్ అనేక ప్రేమ కథ చిత్రాల్లో నటించారు. దేవదాస్, నేను శైలజ వంటి హిట్స్ అతని ఖాతాలో ఉన్నాయి. అందుకే ఈ సారి కూడా ప్రేమ కథనే ఎంచుకున్నారు. సినిమా చూపిస్తా మామ, నేను లోకల్ వంటి సినిమాలతో జోరు మీదున్న త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో “హలో గురు ప్రేమ కోసమే” చేశారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీపై మంచి టాక్ నడుస్తోంది. ప్రకాష్ రాజ్ కీలకరోల్ పోషిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18వ తేదీన థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన రామ్ అనేక సంగతులు వెల్లడించారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా గురించి మాట్లాడారు. “పూరి తో చాలా సార్లు మాట్లాడాను. కానీ ఇంకా ఏ స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. ఒక వేళ స్క్రిప్ట్ ఓకే అయితే చేయడానికి నేను రెడీ” అని వెల్లడించారు. మరి ప్రవీణ్ సత్తారు తో సినిమా ఆగిపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించగా.. “భారీ బడ్జెట్ అయినందువల్ల సెట్స్ మీదకు వెళ్ళలేదు. మరో మంచి కథ కుదిరితే సినిమా తప్పకుండా చేస్తాను” అని స్పష్టంచేశారు. రామ్ గత చిత్రాలు హైపర్, ఉన్నదీ ఒకటే జిందగీ.. మంచి విజయాన్ని అందించలేకపోయాయి. ఈసారి “హలో గురు ప్రేమ కోసమే” హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus