బడ్జెట్ ఇష్యూస్ కారణంగా రామ్ సినిమా ఆగిపోయింది

Advertisement

ఈమధ్య హీరోలందరూ స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ఒక ప్రొజెక్ట్ సెట్స్ మీద ఉన్నప్పుడే మరో ప్రొజెక్ట్ ను స్టార్ట్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అందుకే.. ప్రస్తుతం “హలో గురు ప్రేమ కోసమే” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రామ్ పనిలో పనిగా ఇమ్మీడియట్ గా ప్రవీణ్ సత్తారు ప్రొజెక్ట్ కూడా మొదలెట్టాడు. అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ సంస్థ నిర్మించాలనుకొన్నారు. ఈ చిత్రంలో రాజశేఖర్ విలన్ గా నటిస్తారని వార్తలు కూడా హల్ చల్ చేశాయి. ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలెట్టి.. టెక్నీషియన్స్ & ఆర్టిస్ట్స్ క్యాస్టింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది.

కట్ చేస్తే.. ముందు అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువవుతుండడంతో రామ్-ప్రవీణ్ సత్తారుల సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ముందు 30 కోట్లలో తీద్దామనుకొన్న సినిమా బడ్జెట్ కాస్తా ఇప్పుడు 40-45 కోట్లకి చేరడంతో.. షూటింగ్ మొదలయ్యాక ఇంకాస్త పెరిగితే కష్టం కాబట్టి.. వేరే ఏదైనా స్క్రిప్ట్ ఉంటే వర్కవుట్ చేద్దాం, ఈ కథ మనకి వర్కవుట్ అవ్వదని చెప్పేసారట నిర్మాత-కథానాయకుడు. దాంతో ఆల్రెడీ వర్క్ మొదలెట్టిన ప్రొజెక్ట్ ను మధ్యలో వదలడం ఇష్టం లేని ప్రవీణ్ సత్తారు.. ఇదే కథను వేరే స్టార్ హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం చిన్న చిన్న మార్పులు చేసి అదే కథను వేరే స్టార్ హీరోతో తెరకెక్కించే పనిలో ఉన్నాడు ప్రవీణ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus