మర్డర్ కేసులో అసలు నిందితుడు రామ్…?

  • March 12, 2019 / 04:34 PM IST

గత అయిదు సంవత్సరాలుగా ఒక్క ‘నేను శైలజ’ చిత్రం తప్ప మరో హిట్టందుకోలేదు మన ఎనర్జిటిక్ స్టార్ రామ్. ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రం పర్వాలేదనిపించినా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం రామ్ సరికొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రం తరువాత రామ్ మరో ఓ రీమేక్ చిత్రంలో నటించబోతున్నాడట.

అందుతున్న సమాచారం ప్రకారం… ఇటీవల తమిళంలో విడుదలయ్యి భారీ విజయాన్ని సాధించిన ‘థడమ్’ చిత్ర రీమేక్ లో నటించడానికి రామ్ రెడీ అవుతున్నాడట. అతి తక్కువ బడ్జెట్లో తమిళంలో అరుణ్ విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘థడమ్’ చిత్రం అక్కడ 15 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది. దీంతో ఈ చిత్రం తెలుగు రీమేక్ హక్కుల కోసం గట్టిపోటీ నెలకొంది. ఇప్పటికే చివరికి తెలుగు రీమేక్ హక్కులను స్రవంతి రవికిశోర్ దక్కించుకున్నారని సమాచారం. ఈ రీమేక్ కి ఠాగూర్ మధు కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తుంది. ఇక రీమేక్ కి సంబందించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus