Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత గ్రాండియర్ విషువల్స్ తో తెరకెక్కుతున్న పౌరాణిక ప్రాజెక్టు ‘రామాయణ’. భారీ అంచనాల నడుమ దర్శకుడు నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

Ramayana

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ,శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బయటకు వచ్చిన అప్డేట్ ఏమిటంటే, రణ్‌బీర్ ఒకే పాత్రతో కాకుండా డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారట. రాముడి పాత్రతో పాటు పరశురాముడి పాత్రను కూడా ఆయనే పోషిస్తున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విష్ణుమూర్తి అవతారాలలో రెండు విభిన్న స్వభావాల పాత్రలను ఒకే నటుడు పోషించడం ఈ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

రాముడు శాంత స్వభావానికి ప్రతీక అయితే, పరశురాముడు ఆగ్రహానికి ప్రతీకగా నిలుస్తాడు. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని రణ్‌బీర్ తన నటనతో ఎలా చూపిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా సీతా స్వయంవరం సమయంలో శివధనస్సు విరిగిన తర్వాత పరశురాముడి ఎంట్రీ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

ఈ భారీ చిత్రంలో సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారు. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం దీపావళి సందర్భంగా విడుదలయ్యే అవకాశముండగా, రెండో భాగం తర్వాతి ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం రణ్‌బీర్ కెరీర్‌కే కాదు, భారతీయ సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నాయంటూ సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus