రానా తో గల్లీబాయ్ రీమేక్….?

  • February 23, 2019 / 09:51 PM IST

ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన బాలీవుడ్ చిత్రం ‘గల్లీబాయ్’. జోయా అఖ్తర్ డైరెక్షన్ కి బాలీవుడ్ ప్రేక్షకుల తో పాటూ చాలా మంది టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రానికి ఫిదా అయిపోయారు. రణవీర్ సింగ్, అలియ భట్ ల నటనకు ప్రశంసల జల్లు కురిసింది. ఇక ఈ చిత్ర రీమేక్ హక్కుల్ని ‘గీతా ఆర్ట్స్’ అధినేత అల్లు అరవింద్ దక్కించుకున్నారని టాక్ నడుస్తుంది.

ఇదిలా ఉండగా… ఈ చిత్రాన్ని టాలీవుడ్ లో ఎవరితో రీమేక్ చేస్తే బాగుంటుంది.. అని ‘బాలీవుడ్ లైఫ్’ అనే ఒక ఆంగ్ల పత్రిక ఓ ఆన్లైన్ పోల్ నిర్వహించింది . ఇక ఈ పోల్ లో ముగ్గురు పేర్లని ఆప్షన్ గా ఇచ్చింది. వీరిలో అల్లు అర్జున్.. విజయ్ దేవరకొండ.. రానా దగ్గుబాటి పేర్లు ఉన్నాయి. ఈ పోస్ట్ కి రానా స్పందిస్తూ… ‘దయచేసి నన్ను వదిలెయ్యండి… నాకు అంత టాలెంట్ లేదు…’ అంటూ నవ్వుతున్న స్మైలీస్ ని పెట్టాడు. దీనికి కొందరు నెటిజన్స్ స్పందిస్తూ… ‘సర్… మీరు సూపర్ టాలెంటెడ్.. అలా మీరు అనకండి’ అంటూ రానా ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో .. ఈ టాపిక్ వైరల్ గా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus