‘మొత్తానికి ఆమె ఓకే చెప్పింది’ అంటూ తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పడానికి రానా రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే. మిహీక బజాజ్ అనే ఈవెంట్ మేనేజర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు కూడా రానా మరియు అతని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్’ లో ఒకడైన రానా.. ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటాడు అని ఎవ్వరూ ఊహించలేదు.’చాలా సార్లు నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు.. నాకు ఇంకా బాధ్యత రాలేదు అంటూ చెప్పేవాడు’ రానా.
అలాంటి రానా వెంటనే పెళ్లి విషయం చెప్పడం.. అదే క్రమంలో రానా,మిహీక లకు రోకా ఫంక్షన్ చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇక ఆగష్ట్ 8నే రానా పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మూవీ మొఘల్ రామానాయుడు గారి పెద్ద మనవడు పెళ్లి ఎంతో ఘనంగా, వైభవంగా జరిపించాలి అని రానా తండ్రి మరియు రామానాయుడు గారి పెద్దకొడుకు అయిన సురేష్ బాబు అనుకున్నారు.కానీ ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిరాడంభరంగానే పెళ్లి చెయ్యాలని ఫిక్స్ అయ్యారు.
ఇదిలా ఉండగా.. అతి త్వరలోనే రానా, మిహీక ల ఎంగేజ్మెంట్ ను నిర్వహించబోతున్నారట. ఈ సందర్భంగా మిహీకా తన ప్రీ వెడ్డింగ్‌కు సంబంధించిన ఫోటో షూట్ లో పాల్గొంది.ఎంతో ట్రెడిషనల్ గా దగ్గుబాటి వారి ఇంటికోడలు దర్శనమిచ్చింది. మిహీక డ్రెస్ డిజైన్ చేసిన వ్యక్తిని నిజంగా మెచ్చుకోవలసిందే. చూడటానికి నార్త్ స్టైల్ లో అనిపించినా చాలా పద్దతిగా ఆ డ్రెస్ ఉంది. ఇక మాస్క్ లో కూడా మిహీక ఫోటో షూట్ లో పాల్గొనడం విశేషం. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32