చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన్లో రానా?

  • December 9, 2018 / 09:42 AM IST

‘బాహుబలి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు మన ‘భల్లాల దేవుడు’ రానా. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా రానాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం వచ్చి దాదాపు సంవత్సరం పైనే అవుతున్నా రానా నుండీ మరే చిత్రం రాలేదు. అయితే ‘ఎన్టీఆర్’ బయోపిక్ తో సంక్రాంతికి పలకరించనున్నాడు రానా.., బాలీవుడ్ లో ‘హౌస్ ఫుల్ 4’ చిత్రంలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.

తాజాగా రానా ఓ క్రేజీ డైరెక్టర్ తో చిత్రాన్ని లైన్లో పెట్టినట్టు సమాచారం. విభిన్న చిత్రాలకు ‘కేర్ అఫ్ అడ్రెస్స్’ అయిన చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో రానా ఓ చిత్రాన్ని చేబోతున్నాడట. ఈ మధ్య నే చంద్ర శేఖర్ యేలేటి వినిపించిన కధ రానా కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్టు ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus