పెళ్లి, పిల్లల విషయంలో రాణా సెన్సేషనల్ కామెంట్స్

Advertisement

మన టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో రాణా ఒకడు. మనోడికి పెళ్లి అవ్వలేదు కానీ.. మనోడికి ఉన్నన్ని ఎఫైర్లు టాలీవుడ్ లో ఏ హీరోకి లేవు. కెరీర్ తొలినాళ్లలోనే బాలీవుడ్, కోలీవుడ్ లో వరుసబెట్టి సినిమాలు చేసిన రాణాకు త్రిష, బిపాసాబసు వంటి హీరోయిన్లతో ఎఫైర్లు ఉన్నాయి. కానీ.. ఇప్పటివరకూ మన రాణా బాబుకి అమ్మాయి. పెళ్లి, పిల్లలు అనే విషయాలు అర్ధం కాలేదంట. ఈ విషయాన్ని మనోడు స్వయంగా నిన్న జరిగిన “జెర్సీ” సక్సెస్ మీట్ లో చెప్పడం విశేషం.

ఇన్ని ఎఫైర్లు, ఇంత మంది హీరోయిన్స్ తో పరిచయాలు, రెగ్యులర్ గా పార్టీలు ఇన్ని ఉన్నప్పటికీ.. రాణా బాబు ఇలా పెళ్లి, పిల్లలు, అమ్మాయిలు అర్ధం కారు అని చెప్పడం చూస్తుంటే.. మనోడు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అసలే ఇండస్ట్రీ మొత్తం రాణా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురుచూస్తుండగా బాబు ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus