గౌతమి పుత్ర శాతకర్ణిలో రానా?

  • May 19, 2016 / 08:14 AM IST

నట సింహా నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా “గౌతమి పుత్ర శాతకర్ణి” ని ప్రకటించినప్పటి నుంచి డైరక్టర్ క్రిష్ పూర్తి ఎఫక్ట్ పెట్టి పనిచేస్తున్నారు. తప్ప కుండా హిట్ కొట్టాలని తపిస్తున్నారు. బాలకృష్ణ తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొరాకో లో వేగంగా జరుగుతూ ఉంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యం లో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ ప్లాన్ చేశారు.

ఈ చిత్రానికి మరింత గ్రాండ్ లుక్ తీసుకు రావడానికి దగ్గుబాటి రానాను నటించమని క్రిష్ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదివరకు రానా క్రిష్ దర్శకత్వంలో కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రంలో నటించారు. ఇది రానాకు విజయాన్ని, మంచి పేరును తెచ్చి పెట్టింది. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం కొనసాగుతూ ఉంది. రానా చారిత్రాత్మక సినిమా రుద్రమ దేవి లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. అలాంటి చారిత్రాత్మక సినిమా అయిన గౌతమి పుత్ర శాతకర్ణి లో నటించేందుకు ఒప్పుకుంటాడని క్రిష్ ఆలోచించాడు. కాని ఈ ఐడియా బెడిసి కొట్టింది. తక్కువ టైం లో ఒకే రకమైనా పాత్రల్లో కనిపించడం రానాకు ఇష్టం లేదని అందుకే ఈ ప్రపోజల్ ను పక్కన పెట్టినట్లు రానా సన్నిహితులు చెప్పారు.

క్రిష్ మీద అభిమానంతో చివరి క్షణంలో గౌతమి పుత్ర శాతకర్ణి లో నటించేందుకు రానా అంగీకరించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus