ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ డైరెక్షన్లో ‘సాహో’ చిత్రం చేస్తూనే మరో పక్క ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో మరో చిత్రం చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ‘కాఫీ విత్ కరణ్’ అనే షో లో ప్రభాస్, రాజమౌళి, రానా పాల్గొన్నారు. ఈ షో ఇంకా ప్రసారం కానప్పటికీ కొన్ని విషయాలు బయటకు వచ్చాయట.ఇక ఈ షోలో ప్రభాస్ పెళ్ళి గురించి చర్చ జరిగినట్లు సమాచారం.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ త్వరలో పెళ్ళి చేసుకుంటున్నారంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. మరో పక్క ప్రభాస్ – అనుష్క మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని.. త్వరలో వీరిద్దరూ పెళ్ళి పీటలెక్కబోతున్నారంటూ మరోపక్క పుకార్లు షికార్లు చేసిన సంగతి తెలిసిందే.
2
ఇదిలా ఉంటే ఈ షో లో కరణ్ జోహార్ ప్రభాస్ ను ‘నీ పెళ్ళి ఎప్పుడు అని ప్రశ్నించగా…. రాజమౌళి మధ్యలో కల్పించుకొని ఫన్నీగా స్పందించినట్టు సమాచారం. ప్రభాస్ కంటే ముందుగా రానా పెళ్ళి అవుతుందని రాజమౌళి సరదాగా చెప్పుకొచ్చాడట. అయితే ప్రభాస్ మాట్లాడుతూ…. ‘నాకు చాలా బద్ధకం..అదే నా బలహీనత అని ప్రభాస్ చెప్పుకొచ్చాడట. ‘బాహుబలి’ చిత్రం కోసం వాళ్ళ ఐదేళ్ల ప్రయాణం గురించి రాజమౌళి ఎన్నో విషయాలు తెలియజేసాడట. త్వరలో ప్రసారం కాబోతోన్న ఈ షో పై ఇప్పటి నుండే జనాలకు ఆసక్తి పెరిగింది.
4