“బాహుబలి” సినిమాలో ప్రభాస్ రోల్ కోసం ముందు ఆ బాలీవుడ్ హీరోని అనుకొన్నారు, ఈ స్టార్ హీరో ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశాడు” అనే వార్తలు మనం వింటూనే ఉన్నాం. కానీ.. రాజమౌళి “నేనసలు స్టోరీ రాసిందే ప్రభాస్ కోసం, ఇంకెవర్నీ అప్రోచ్ అవ్వలేదు” అని డిక్లేర్ చేసేయడంతో ఆ వార్తలకు తెరపడింది. అయితే.. “అమరేంద్ర/మహేంద్ర బాహుబలి” తర్వాత సినిమాలో అదే స్థాయి పవర్ ఫుల్ రోల్ అయిన “భల్లాలదేవుడు” పాత్రలో రాణా పలికించిన రౌద్రాన్ని ఎవరు మర్చిపోలేరు. మొదటి భాగానికి ఇప్పటికే “బెస్ట్ విలన్”గా బోలెడు అవార్డులు అందుకొన్న రాణా.. త్వరలో రెండో పార్ట్ కి కూడా మరిన్ని అవార్డులు అందుకోనున్నాడు.
అయితే.. “భల్లాలదేవుడు” పాత్రకి రాణా ఫస్ట్ ఛాయిస్ కాదట. ఇదేదో ఊహించి రాస్తున్న గాసిప్పు కాదు.. స్వయంగా రాణా చెప్పిన సెన్సేషనల్ సీక్రెట్. తొలుత “భల్లాలదేవుడు” పాత్ర కోసం “గేమ్ ఆఫ్ త్రోన్స్” అనే వెబ్ సిరీస్ ఫేమ్ “కాల్ డ్రోగో” అనే హాలీవుడ్ నటుడ్ని ఎంపిక చేశారట నిర్మాత సోభు యార్లగడ్డ. అయితే.. ఎవరైనా తెలుగు నటుడైతేనే బాగుంటుందని రాజమౌళి సూచన మేరకు రాణా పేరు పరిశీలనలోకి రావడం, పాత్ర కోసం రాణా దాదాపు 20 కేజీల బరువు పెరగడానికి సమ్మతించడంతో.. “భల్లాలదేవుడు” పాత్రలోకి రాణా పరకాయ ప్రవేశం చేశాడన్నమాట. షూటింగ్ జరుగుతున్నప్పుడు సోభు అప్పుడప్పుడూ రాణాతో అనేవాడట “నువ్ కల్ డ్రోగో”కి రీప్లేస్ మెంట్ అని.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.