భారీ ధర పలికిన రంగస్థలం 1985 హిందీ శాటిలైట్ రైట్స్!

  • November 7, 2017 / 06:25 AM IST

ధృవ వంటి సూపర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా ‘రంగస్థలం 1985’. క్యూట్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ  సినిమాపై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ డైరక్షన్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్లో షూటింగ్ జరుపుకుంటోంది. నేటి స్మార్ట్ ఫోన్ల కాలానికి దూరంగా 80 ల కాలంలో పల్లెటూరి నేపథ్యంలో సాగే  రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోంది. అంతేకాదు ఇందులో చరణ్ పూర్తిగా తన లుక్ మార్చి పక్కా పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. అందుకే ఈ సినిమాపై తెలుగులోనే హిందీలోనూ క్రేజ్ ఏర్పడింది. అందుకే హిందీ శాటిలైట్ రైట్స్ భారీ ధర పలికింది.

తెలుగు శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఛానల్ 18 కోట్లకు సొంతం చేసుకోగా.. హిందీ రైట్స్ ని నేషనల్ ఛానెల్ 10.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. సంతకాలు పూర్తికాగానే అధికారికంగా ప్రకటించనున్నారు.  జగపతిబాబు, ఆది పినిశెట్టి , అనసూయ, తదితరులు నటిస్తున్న ఈ సినిమా మొదట  సంక్రాంతికి రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ అప్పటికీ చిత్ర నిర్మాణం రెడీ కానందున ఏప్రిల్ కి పోస్ట్ పోన్ చేశారు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus