శ్రీమంతుడు రికార్డ్ ని దాటనున్న రంగస్థలం

  • April 2, 2018 / 12:58 PM IST

విడుదలైన మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ‘రంగస్థలం‘ చిత్రం ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటుతోంది. తొలిరోజే 1.2 మిలియన్ డాలర్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం శని, ఆదివారాలు కలిపి మొదటి వారంలోనే 2.32 మిలియన్ డాలర్లను రాబట్టుకుంది.ఇంకొద్ది రోజుల్లో ఈ మొత్తం అవలీలగా 3 మిలియన్ డాలర్లను టచ్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్లో “బాహుబలి-2, బాహుబలి-1” తర్వాత మహేష్ బాబు “శ్రీమంతుడు” 2.87 మిలియన్ డాలర్ల ఫుల్ రన్ తో మూడవ స్థానంలో ఉండగా ఇప్పుడు “రంగస్థలం” ఆ రికార్డును బ్రేక్ చేసే దిశగా వెళుతోంది. ఇక ఈ చిత్రం ఫుల్ రన్ గ్రాస్ కూడ పెద్ద మొత్తంలోనే ఉండే అవకాశాలున్నాయి.

రామ్ చరణ్, సుకుమార్ ల క్రేజీ కాంబినేషన్, కథ, కెమెరా వర్క్, సమంత, అనసూయల పెర్ఫార్మెన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొట్టమొదటిసారిగా ఒక సినిమా సక్సెస్ కి యావత్ చిత్రబృందానికి పేరు లభిస్తోంది. అందువల్ల అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మద్యాహ్నం చిత్రబృందం హైద్రాబాద్ లో సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించింది. మూడు రోజుల్లోనూ వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన “రంగస్థలం” త్వరలోనే నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus