తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకరికోసం రాసుకున్న కథలో మరొకరు నటించడం సర్వసాధారణం. అలాగే కథ నచ్చినప్పటికీ అది సూటయ్యే వారి పేరు సూచించడం ఈ మధ్య ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చాటుతోంది. “24” కథ మొదట తన వద్దకు వచ్చినప్పటికీ మహేష్ సూర్య పేరు సూచించారు. అతని అంచనా కరక్ట్ అయి విజయం సాధించింది. అలాగే ఇప్పుడు మరొక సంఘటన జరిగింది. సుకుమార్ ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న “రంగస్థలం” సినిమా కథని అల్లు అర్జున్ కోసం రాసుకున్నారంట. బన్నీకి కూడా వినిపించారంట. ఈ స్టోరీ బన్నీకి భలే నచ్చినప్పటికీ.. ఇందులో రామ్ చరణ్ అయితే ఇంకా బాగుంటుందని చెప్పడంతో.. అతనికి తగ్గట్టు మార్పులు చేసి ఈ సినిమాని తెరకెక్కించినట్లు ఫిలింనగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. పక్క పల్లెటూరి యువకుడిగా చెర్రీ స్టయిల్ ఉంది. అతని పేరు కూడా బయటికి వచ్చింది. చిట్టి బాబు అని సమాచారం. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, అది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మార్చిలో థియేటర్లోకి రానుంది. ధృవ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.