Allu Arjun: ఇప్పటవరకూ ఎవరు చూడని అల్లు అర్జున్ రేర్ ఫోటో గ్యాలరీ!

పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడిగా అలాగే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి కొడుకుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అల్లు అర్జున్. కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో వచ్చిన ‘గంగోత్రి’ చిత్రంతో ఎంట్రీ హీరోగా పరిచయమయ్యాడు.నిజానికి తేజ డైరెక్షన్లో ‘జయం’ చిత్రంతో పరిచయమవ్వాల్సిన అల్లు అర్జున్.. ఎందుకో ఆ చిత్రంలో నటించలేదు. అయితే ‘గంగోత్రి’ కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’ చిత్రంలో బాల నటుడిగా అల్లు అర్జున్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. బహుశా ఆ విషయం చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇక ‘గంగోత్రి’ సినిమాకి ముందు మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘డాడి’ చిత్రంలో కూడా ఓ చిన్న పాత్రలో నటించాడు బన్నీ.

అయితే ‘డాడి’ సినిమాలో ఓ సందర్భంలో చించేసేలా డ్యాన్స్ చేసి అదరకొట్టిన అల్లు అర్జున్.. ‘గంగోత్రి’ సినిమాలో మాత్రం అంతగా అలరించలేకపోయాడనే చెప్పాలి. అయితే ఆ చిత్రం హిట్టే అయినప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాడు బన్నీ. ‘ఈ కుర్రాడు హీరో అవుతాడా?’ అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే వాళ్ళందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఆర్య’ చిత్రంలో కొత్త మేక్ ఓవర్ తో కనిపించి అలరించాడు. ఆ తరువాత వచ్చిన ‘బన్నీ’ ‘దేశముదురు’ ‘పరుగు’ వంటి చిత్రాలతో స్టార్ హీరో అయిపోయాడు.

17 ఏళ్ళ బన్నీ కెరీర్ లో ‘జులాయి’ ‘రేసుగుర్రం’ ‘సరైనోడు’ ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్టైలిష్ స్టార్ గా బన్నీ ఎదిగాడు అంటే అది అతని హార్డ్ వర్క్ కారణంగా అనే చెప్పాలి. తెలుగుతో పాటు మలయాళంలో కూడా ఇతనికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సరే ఇదంతా పక్కన పెట్టేసి.. మనం ఇప్పటి వరకూ చూడని అల్లు అర్జున్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus