Pawan Kalyan Rare Photos: ఇప్పటవరకూ ఎవరు చూడని పవన్ కళ్యాణ్ రేర్ ఫోటో గ్యాలరీ!

అన్నయ్య రిఫరెన్స్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుని ఇప్పుడు తిరుగులేని స్టార్ గా ఎదిగాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. మొదట పవన్ కళ్యాణ్ కు డైరెక్టర్ అవ్వాలనే ఆలోచన ఎక్కువ ఉండేదట. ఎలాగూ అన్నయ్య పెద్ద స్టార్ హీరో కాబట్టి… అలాగే చిన్న అన్నయ్య నటుడు, నిర్మాత కాబట్టి వారికి సంబందించిన కొన్ని సినిమాలకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు. పెద్దన్నయ్య (చిరంజీవి) వద్దకు కథ చెప్పడానికి వచ్చిన దర్శక నిర్మాతలకి… ‘మనం ఎలాంటి సినిమా తీసినా.. అది కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.. అలాగే అభిమానులకి నచ్చే ఎలిమెంట్స్ మాత్రం మిస్సవకుండా ఉండాలి’ అనే చెప్పేవారట. ఈ విషయాలు దగ్గరుండి వింటూ వచ్చిన పవన్ మనసులోకి అది బలంగా వెళ్ళిపోయిందట. ఇక తన వదిన మాట విని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పవన్ హీరో అవ్వడం వెనుక ఉన్న అసలు వ్యక్తి సురేఖ గారు.

మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్.. ఆ చిత్రంతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు. అయితే మొదటి సినిమాలోనే రిస్క్ తో కూడుకున్న ఫీట్లు చేయడంతో ఒక్కసారిగా యూత్ అంతా ఆయనకి అట్ట్రాక్ట్ అయిపొయింది. ఇక తరువాత వచ్చిన ‘గోకులంలో సీత’ ‘సుస్వాగతం’ చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి మంచి ఇమేజ్ ఏర్పడింది. ఇదే ఊపులో వచ్చిన ‘తొలిప్రేమ’ చిత్రం పవన్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ చిత్రం ఇప్పటికి అలరిస్తూనే ఉంది. ‘తొలిప్రేమ’ ఓ క్లాసిక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అటుతరువాత వచ్చిన ‘తమ్ముడు’ చిత్రంతో కామెడీ కూడా అద్భుతంగా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇక ‘బద్రి’ చిత్రంతో పవన్ కళ్యాణ్ కు మాస్ ఇమేజ్ దక్కింది.’ఖుషి’ కూడా పవన్ కెరీర్ లో ఓ క్లాసిక్ అని చెప్పాలి. ఇక ఆ చిత్రం తరువాత ‘జల్సా’ వరకూ హిట్టు లేకుండా ఉన్నా… క్రేజ్ మాత్రం తగ్గలేదు. కానీ ‘జల్సా’ తరువాత కూడా పవన్ కళ్యాణ్ కి వరుస ప్లాపులు పడ్డాయి. అవి 2012 లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ తో ఆగాయి. 2013 లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ కు ఒక్క హిట్టు లేదు. అలాగే ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ దూరం కేవలం కామా మాత్రమే అవ్వాలి కానీ ఫుల్ స్టాప్ కాకూడదు అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ‘జనసేన’ అధ్యక్షుడుగా పార్టీని బలోపేతం చేయడానికి చాలా కష్టపడుతున్నాడు పవన్ కీ సంబందించిన రేర్ పిక్స్ ను కొన్నిటిని చూద్దాం రండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus