ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకపాత్రలో రాశీఖన్నా

  • August 18, 2018 / 01:44 PM IST

ఎప్పుడైతే “ఎన్టీఆర్” బయోపిక్ బాధ్యతను బాలయ్య తనకు ఇష్టమైన దర్శకుడు క్రిష్ కు అప్పగించాడో.. అప్పట్నుంచి క్రిష్ ఈ ప్రొజెక్ట్ ను ట్రాక్ ఎక్కించడమే కాకుండా రాకెట్ స్పీడ్ తో షూటింగ్, క్యారెక్టర్స్ ఫైనల్ చేయడం వంటివి చేస్తూ వాయువేగంతో చిత్రీకరణ పూర్తి చేస్తున్నాడు. ఇటీవలే చంద్రబాబు నాయుడుగా రాణాను ఫైనల్ చేయడమే కాక నిన్నట్నుంచి రాణాతో షెడ్యూల్ కూడా మొదలుపెట్టిన క్రిష్.. ఇప్పటికే ఈ సినిమాలో బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా.. సావిత్రిగా కీర్తి సురేష్.. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. చంద్రబాబుగా నారా నటిస్తుండగా.. ఇప్పుడు మరొక పాత్రగా జయప్రద పాత్రలో రాశిఖన్నాను ఎంపిక చేసుకున్నారు.

దీనికి తోడు షెడ్యూల్ కి ఒకరు చొప్పున కొత్తగా నటులని సినిమాకి జోడిస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. స్వాతంత్రదినోత్సవాన్ని పురష్కరించుకొని పోస్టర్ రిలీజ్ చేసి క్రిష్ విశేషమైన రెస్పాన్స్ ను అందుకొన్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం, బాలయ్య అచ్చుగుద్దినట్లు ఎన్టీఆర్ లా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. క్రిష్ ఇదే ఊపులో సినిమాని పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేశాడంటే.. “ఎన్టీఆర్” బయోపిక్ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus